ఇది నిజంగా వర్ణించలేని అనుభూతి.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

by Hamsa |   ( Updated:2024-01-27 07:18:38.0  )
ఇది నిజంగా వర్ణించలేని అనుభూతి.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్
X

దిశ, సినిమా: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం నేడు అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే రామ మందిరాన్ని ముస్తాబు కూడా చేశారు. ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు మెగా ఫ్యామిలీకి కూడా ఆహ్వానం అందింది. తాజాగా, దీనిపై చిరంజీవి స్పందిస్తూ ట్విట్టర్‌ వేదికగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘చరిత్ర సృష్టిస్తుంది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘటం ఇది. నిజంగా అద్భుతమైన అనుభూతి.. అయోధ్యలో రామ్‌లల్లా పట్టాభిషేకాన్ని చూసేందుకు ఈ ఆహ్వానాన్ని భగవంతుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నాను.

ఐదు వందల సంవత్సరాలకు పైగా తరతరాలుగా భారతీయుల నిరీక్షణ ఫలించబోతున్న ఆ మహత్తర అధ్యాయం. ఆ దివ్యమైన ‘చిరంజీవి’ హనుమంతుడు, అంజనా దేవి కుమారుడే స్వయంగా ఈ భూలోక అంజనా దేవి కొడుకు చిరంజీవికి ఈ అమూల్యమైన క్షణాలను చూసే బహుమతిని ఇచ్చినట్లు నాకు అనిపిస్తుంది. ఇది నిజంగా వర్ణించలేని అనుభూతి. నాకు, నా కుటుంబ సభ్యులకు ఎన్నో జన్మల పుణ్యఫలం ఇది. గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక అభినందనలు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి జీకి హృదయపూర్వక అభినందనలు. ఈ మహత్తర సందర్భంలో ప్రతి భారతీయునికి హృదయపూర్వక అభినందనలు! ఆ బంగారు క్షణాల కోసం ఎదురు చూస్తున్నా .. జై శ్రీరామ్’’ అంటూ రాసుకొచ్చారు.

Advertisement

Next Story