స్టార్ హీరోలకు ధీటుగా Anchor Pradeep రెమ్యూనరేషన్!

by Hamsa |   ( Updated:2023-09-20 05:51:35.0  )
స్టార్ హీరోలకు ధీటుగా Anchor Pradeep రెమ్యూనరేషన్!
X

దిశ, వెబ్‌డెస్క్: యాంకర్ ప్రదీప్..ప్రస్తుతం ఉన్నటువంటి బుల్లి తెర యాంకర్లలో పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే షోస్ లల్లో ప్రదీప్ చేసే కామెడీకి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఫ్యాన్స్ అవుతారు. షోలో తాను వేసే స్పాంటేనియస్ పంచులు ఎంత ఎంటర్టైన్ చేస్తాయో మనందరికీ తెలుసు. ప్రదీప్ యాంకర్ గా ఉన్నాడంటే ఆ షో పెద్ద హిట్ అవ్వాల్సిందే. అలా ఉంటుంది మరి ప్రదీప్ కామెడీ టైమింగ్.

మోస్ట్ ఎనర్జిటిక్ అండ్ ఎంటర్టైనింగ్‌గా షో రన్ చేయడంలో ప్రదీప్‌కు సాటిరారు ఎవరు. ముఖ్యంగా యూత్‌లో ప్రదీప్‌కి మామూలు ఫాలోయింగ్ ఉండదు. అటు అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా ఫేవరెట్ యాంకర్..సక్సెస్ ఫుల్ షోస్‌తో తీరికలేకుండా ఉంటాడు అతను. ఇన్ని షోలతో బిజీగా ఉండే ప్రదీప్ ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంత అనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది.

అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రదీప్ తన రెమ్యూనరేషన్ గురించి అడిగినప్పుడు అసలు విషయం చెప్పకుండా మాట మార్చాడు. పర్టిక్యులర్‌గా చెప్పకుండా రఫ్‌గా ఒక యావరేజ్ అమౌంట్ చెప్పండి అన్నప్పుడు,ఒక్క రోజుకు సుమారు మూడు నుండి నాలుగు లక్షల వరకు ఉంటుంది అని చెప్పకనే చెప్పాడు ప్రదీప్. అంటే ఒక్క నెలకు ప్రదీప్ సుమారు 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడన్న మాట. అయితే ఇప్పటికైతే బాగానే ఆస్తులు సంపాదించానని ఆ ఇంటర్వ్యూలో ప్రదీప్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story