- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరో Ravi Teja కోసమే ‘Bhola Shankar’ సినిమా తీసినట్టుగా ఉంది.. RGV ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా కలిసి నటించిన చిత్రం ‘భోళా శంకర్’. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలై బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. తమిళంలో వేదాళంగా తెలుగు రిమేక్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. భోళా శంకర్ విషయంలో సాధారణ ప్రేక్షకులతో పాటు మెగా అభిమానులు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. అలాగే డైరెక్టర్‌పై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇకమీదట ఇలాంటి సినిమాల్లో నటించొద్దని చిరంజీవికి ఫ్యాన్స్ విజ్ఞప్తి కూడా చేశారు. దీంతో వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లతో చిరంజీవికి కౌంటర్ ఇస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కొంతమంది పొగడ్తలకు పడిపోయి, కథల ఎంపిక విషయంలో పొరపాటు చేస్తున్నారని ఆయన ఓ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే.
తాజాగా, ఆర్జీవి భోళా శంకర్‌పై మరోసారి సెటైరికలు ట్వీట్ చేశాడు. ‘‘వాల్తేరు వీరయ్య ఎవరి మూలాన ఆడిందో , ప్రూవ్ చేయడానికి తీసినట్టుంది బి ఎస్’’ అంటూ రాసుకొచ్చాడు. వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కూడా నటించారు. ఈ క్రమంలో రవితేజ వల్లే ఆ సినిమా ఆడిందని ప్రూవ్ చేసేందుకే భోళా శంకర్ చేసినట్లు అనిపిస్తుందని అర్థం వచ్చేలా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. దీంతో అది చూసిన నెటిజన్లు కొంత మంది ఆర్జీవికి సపోర్ట్ చేస్తుంటే మరికొంత మంది గునపంతో పొడుస్తున్నావ్ ఎందుకు స్వామి? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
వాల్తేరు వీరయ్య ఎవరి మూలాన ఆడిందో , ప్రూవ్ చెయ్యటానికి తీసినట్టుంది బి ఎస్ 😳
— Ram Gopal Varma (@RGVzoomin) August 12, 2023