సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్న'Varasudu '

by Prasanna |   ( Updated:2023-01-07 05:45:53.0  )
సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్నVarasudu
X

దిశ, సినిమా : విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తమిళ్ మూవీ 'వారిసు'ను తెలుగులో 'వారసుడు' పేరుతో విడుదల చేయనున్నారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రాష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెండు భాష‌ల్లోనూ ఒకే రోజు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు కేవ‌లం త‌మిళ వెర్షన్‌ను మాత్రమే జ‌న‌వ‌రి 11న రిలీజ్ చేయ‌బోతున్నట్లు డేట్ అనౌన్స్ చేశారు. కానీ తెలుగు వెర్షన్ రిలీజ్‌కు సంబంధించి ఎలాంటి ప్రక‌ట‌న చేయ‌లేదు. ఇక తెలుగు వెర్షన్‌ను సంక్రాంతి త‌ర్వాతే ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌చ్చే అవ‌కాశం ఉన్నట్లు సమాచారం. త్వర‌లోనే తెలుగు రిలీజ్ డేట్‌ను దిల్‌రాజు అనౌన్స్ చేయ‌నున్నట్లు తెలిసింది.

Also Read..

Pawan Kalyan అభిమానులకు సూపర్ న్యూస్

Advertisement

Next Story