అలియా భట్ ఒక్క డ్రెస్‌ను తయారుచేయడానికి 1905 గంటలా.. ఎంత మంది పని చేశారంటే? ఫొటోలు వైరల్

by Hamsa |   ( Updated:2024-05-08 12:58:29.0  )
అలియా భట్ ఒక్క డ్రెస్‌ను తయారుచేయడానికి 1905 గంటలా.. ఎంత మంది పని చేశారంటే? ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. టాలీవుడ్‌లో ఈ అమ్మడు ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ప్రజెంట్ బాలీవుడ్‌లో వరుస మూవీస్ చేస్తూ దూసుకుపోతుంది. అలాగే తన భర్త, కూతురు రాహాతో పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే కెరీర్ పరంగా కూడా మంచి స్థాయిలో ఉంది. అలియ సోషల్ మీడియాలోనే పలు ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది.

తాజాగా, అలియా భట్ ఓ ఈవెంట్‌ కోసం తయారు చేయించుకున్న డ్రెస్ గురించి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే న్యూయార్క్‌లో జరిగే మెట్ గాలా ఈవెంట్‌కు వెళ్లింది. ఇందులో అలియా భట్ తన డ్రెస్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అయితే ఈ వెంట్‌లో ఆమె ధరించిన డ్రెస్ ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ తయారు చేసినట్లు సమాచారం. దీనిని ఏకంగా 163 మంది చేతుల మీదుగా 1905 గంటల పాటు తయారు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో.. అలియా భట్ డ్రెస్ గురించే అంతా నెట్టింట చర్చించుకుంటున్నారు.

Read More...

22ఏళ్ల వరకు నో ముద్దూముచ్చట..కానీ ఆ హీరో కలిశాక ఆగలేకపోయా.. కన్యత్వాన్ని కోల్పోయా.. సీనియర్ స్టార్ హీరోయిన్ డే..

Advertisement

Next Story

Most Viewed