'గేమ్‌ ఛేంజర్‌' టైటిల్‌ బీజీఎం కూడా కాపీయేనా..? థమన్ ను ఆటాడుకుంటున్న ట్రోలర్స్

by Shiva |   ( Updated:2023-03-27 08:59:17.0  )
గేమ్‌ ఛేంజర్‌ టైటిల్‌ బీజీఎం కూడా కాపీయేనా..? థమన్ ను ఆటాడుకుంటున్న ట్రోలర్స్
X

దిశ, వెబ్ డెస్క్: థమన్ తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఫామ్ లో ఉన్న సంగీత దర్శకుడు. ఈ మధ్య తాను బాణీలు సమకూర్చిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఒకటి రెండు తప్ప. యూట్యూబ్‌లో అతని పాటలు ట్రెండింగ్‌లోనూ ఉంటున్నాయి. తనదైన శైలిలో తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో థియేటర్లలోని ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర హీరోల సినిమాలకు మ్యూజిక్‌ అందిస్తూ థమన్ తీరిక లేకుండా ఉన్నారు.

తాజాగా రామ్‌చరణ్‌, శంకర్‌ ల కాంబినేషన్‌ లో రూపొందుతున్న మూవీ 'గేమ్‌ ఛేంజర్‌'. తాజాగా చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా నేడు సినిమా టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో థమన్ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ కి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో చరణ్ అభిమానులు మ్యూజిక్ ఇరగదీశాడంటూ థమన్ ఆకాశానికెత్తేస్తున్నారు. మరో వైపు 'గేమ్‌ ఛేంజర్‌' టైటిల్‌ వీడియో వైరల్ కావడంతో ఎప్పటిలాగే థమన్‌పై ట్రోలర్స్ అదే స్థాయిలో ఆటాడుకుంటున్నారు. `గేమ్‌ ఛేంజర్‌` బీజీఎం కాపీ అంటూ కామెంట్ చేస్తున్నారు.

గతంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్ కొన్ని సినిమాల్లోకి ట్యూన్లను కాపీ చేశాడంటూ కామెంట్లు, సోషల్ మీడియాలో మీమ్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. 'గేమ్‌ ఛేంజర్‌' బీజీఎం కూడా ఓ హిందీ ఒరిజినల్‌ సాంగ్‌కి కాపీ అని స్టార్ట్ చేశారు ట్రోలర్స్. అంతేకాదు ఫ్రూఫ్ లు కూడా చూపిస్తున్నారు. ఈ రెండు అటు ఇటు సేమ్‌ ఉన్నాయంటున్నారు. బాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ యోయో హనీ సింగ్‌, ఊర్వసి రౌతేలా కలిసి చేసిన `లవ్‌ డోస్‌` (టూ ఆజ్‌ మెరీ క్లోజ్‌) సాంగ్‌కు సరిగ్గా సరిపోయిందంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే హనీ సింగ్‌ మ్యూజిక్‌ కాస్త స్మూత్‌గా వెళితే, థమన్‌ దాని డోస్‌ పెంచాడని, డబుల్‌ డోస్‌ ఇచ్చి కొత్త బీజీఎం చేశాడంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

https://youtu.be/TvngY4unjn4

Advertisement

Next Story