మోహన్ బాబు, మనోజ్ పెళ్లికి అటెండ్ అవ్వడానికి కారణం ఆమెనా?

by samatah |   ( Updated:2023-03-04 09:21:50.0  )
మోహన్ బాబు, మనోజ్ పెళ్లికి అటెండ్ అవ్వడానికి కారణం ఆమెనా?
X

దిశ, వెబ్ డెస్క్ : గత కొన్ని రోజుల నుంచి భూమ మౌనిక, మనోజ్ ప్రేమలో ఉన్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ చాలా వార్తలు వినిపించాయి. కాగా, ఈ వార్తలు బ్రేక్ వేస్తూ.. వారిద్దరు బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటయ్యారు.

అయితే భూమ మౌనిక, మనోజ్‌, ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. ఇక మౌనిక టీడీపీ పార్టీ కావడం, మోహన్ బాబు ఫ్యామిలీ వైసీపీకి సపోర్టు కావడం, అలాగే మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకు ఇష్టం లేదు. వీరి పెళ్లికి మోహన్ బాబు, విష్ణు అటెండ్ అవ్వడం లేదంటూ చాలా రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఎట్టకేలకు వాటన్నింటికి తెరదించుతూ, ఏకంగా మోహన్ బాబే పెళ్లి పెద్దగా, తన కొడుకు పెళ్లి జరిపించాడు. అంతే కాకుండా మోహన్ బాబు నవదంపతులను ఆశీర్వదిస్తున్న క్రమంలో భూమ మౌనిక కన్నీరు పెట్టుకుంది.

Also Read: నాడు గెస్టుగా, నేడు భర్తగా.. మంచు మనోజ్ పెళ్లిపై ఎన్ని ముచ్చట్లో!

అయితే మోహన్ బాబు మనోజ్ పెళ్లికి అటెండ్ అవ్వడానికి కారణం మంచు లక్ష్మీ అన్నట్లు తెలుస్తోంది. లక్ష్మీ తన తల్లిదండ్రులకు నచ్చ చెప్పి , పెళ్లికి ఒప్పించి ఇద్దరినీ పెళ్లికి తీసుకొచ్చిందంట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also Read: ఏ జన్మ పుణ్యమో అంటూ.. ఆమెపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్..

Advertisement

Next Story

Most Viewed