డబ్బుకోసం సమంత అంత పని చేస్తోందా?

by samatah |   ( Updated:2023-05-31 14:00:25.0  )
డబ్బుకోసం సమంత అంత పని చేస్తోందా?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత ఈ అమ్మడు పూర్తిగా కెరీర్‌పై ఫొకస్ పెట్టింది. ఇక ఇటీవల శాకుంతలం సినిమా డిజాస్టర్‌ అయినప్పటికీ, ఒక్క అడుగు కూడా వెనక్కు వేయకుండా, వచ్చిన ప్రతీ అవకాశాన్ని చేజిక్కించుకుంటుంది.

ఈ నేపథ్యంలో సమంతకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. సమంత ఇప్పుడు తన ఫొకస్ మొత్తం డబ్బుపైనే పెట్టిందంట. ఎందుకంటే, హీరోయిన్ల కెరీర్ ఎప్పుడూ ఒకేలా సాగదు, ఎంత టాలెంట్ ఉన్నా, కొన్ని రోజుల తర్వాత సహాయక పాత్రలకే పరిమితం అవుతుంటారు. ఇక సమంత వయసు ఆల్రెడీ 36. న‌ల‌భైకి చేరువైతే ఆమెకు క్రమంగా అవకాశాలు తగ్గడం ప్రారంభం అవుతాయి. అందుకే ఈ మూడు నాలుగు ఏళ్లలో గట్టిగా సంపాదించాలని సమంత నిర్ణయించుకుందట. అందుకే వీలైనంతవరకు ఎక్కువ ప్రాజెక్టులకు సైన్ చేస్తుందట. అసలు సినిమా హిట్ అవుతుందా, లేదా,? త‌న పాత్ర ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందా.. లేదా..? అనేవి ఏమీ పట్టించుకోవడం లేదట. రెమ్యునరేషన్ అడిగినంత ఇస్తే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తుందట. దీంతో సమంతకు డబ్బు పిచ్చి పట్టుకుంది, డబ్బు కోసం మరింత ఇలా చేయాలా అంటూ కొందరు నెటిజన్స్ ముచ్చటిచ్చుకుంటున్నారు.

Also Read..

Samantha : సమంత ధరించిన చెప్పుల ఖరీదేంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.

‘రాత్రంతా అదే పని.. రోజంతా ఇలా’ సామ్ పోస్ట్ వైరల్

Advertisement

Next Story