నాగచైతన్య‌కు కాబోయే భార్య కూడా సమంత కంటే బోల్డేనా?

by Jakkula Samataha |
నాగచైతన్య‌కు కాబోయే భార్య కూడా సమంత కంటే బోల్డేనా?
X

దిశ, సినిమా : నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల రెండో వివాహం చేసుకోనున్నారు. ఆగస్టు 8న వీరి నిశ్చితార్థం అతి కొద్ది మంది బంధువుల మధ్య వీరి నిశ్చితార్థం జరిగిపోయింది. కాగా, ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా, నాగచైతన్య, సమంతను ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత వీరు మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఇక వీరు డివోర్స్ తీసుకున్నరోజు నుంచి ఇప్పటి వరకు,నాగచైతన్య శోభితతో రిలేషన్‌లో ఉన్నారు అనుకుంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా,సమంత ది ఫ్యామిలీ మ్యాన్2లో బోల్డ్ పాత్రలో చేసినందుకే సమంతపై నాగ చైతన్యకు కోపం వచ్చి, వీరు విడిపోయారని టాక్. కానీ ఇప్పటి వరకు సమంత మాత్రం సింగిల్‌గా తన కెరీర్‌పై ఫోకస్ చేసింది.

ప్రస్తుతం నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం జరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే శోభితకు సంబంధించిన పలు సమాచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తెలుగు అమ్మాయి అయినా, ఆమె కూడా బోల్డ్ హీరోయిన్‌నే. శోభిత స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ దేవ్ పటేల్ హీరోగా నటించిన మంకీ మ్యాన్‌లో ఈ బ్యూటీ వేశ్యపాత్రలో కనిపించింది. అంతే కాకుండా ఈ సినిమాలో శోభిత చాలా బోల్డ్‌గా కనిపిస్తుంటుంది. దీంతో కొందరు నెటిజన్లు నాగచైతన్యపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సమంత బోల్డ్ పాత్రలో చేసినందుకే డివోర్స్ ఇస్తే ఈ నటి కూడా బోల్డే కదా.. ఈమెను ఎలా వివాహం చేసుకుంటున్నారంటూ ఫైర్ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed