ప్రభాస్‌‌తో ఆ సినిమా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా: అనుష్క శెట్టి

by Hamsa |   ( Updated:2024-04-04 02:20:59.0  )
ప్రభాస్‌‌తో ఆ సినిమా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా: అనుష్క శెట్టి
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు నాగార్జున సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తన అందం అభినయంతో అందరినీ కట్టిపడేసింది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు జోడీగా మిర్చి, బిల్లా, బాహుబలి 1, బాహుబలి 2 వంటి చిత్రాల్లో నటించి అభిమానుల గుండెల్లో స్పెషల్ ప్లేస్ సంపాదించుకుంది.

ఈ ఇద్దరి జంట ఎంతో మందిని మైమరిపించింది. ఈ క్రమంలోనే వీరిద్దరు గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఈ జంట అలాంటి వార్తలపై స్పందించి ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చారు. అయితే అనుష్క కొద్ది కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మరో రెండు మూడు చిత్రాల్లో నటిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క ప్రభాస్ సినిమాలో నటించడం వల్ల బాధపడినట్లు ఆసక్తికర కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ‘‘ నేను ప్రభాస్, నమిత నటించిన బిల్లా నటించాము. అయితే ఇందులో బికినీ వేసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో నేను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.

ఒకవేళ ఈ సినిమాను ఒప్పుకోకపోయి ఉంటే కచ్చితంగా ఈ బికినీ సీన్ కోసమైనా సినిమానే రిజెక్ట్ చేసేదాన్ని. ఈ మూవీ ముందుగానే ఒప్పుకుని బాండ్‌పై సంతకం చేయడం వల్ల చివరికి ఏమి చేయలేకపోయాను. దీంతో తప్పని పరిస్థితుల్లో బికిని ధరించవలసి వచ్చింది. నేను ప్రభాస్‌ ఆ సినిమాలో అలా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనుష్క శెట్టి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. పాపం అనుష్క అంతలా ఇబ్బంది పడి ప్రభాస్ సినిమాలో నటించిందా.. అని చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed