- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ అంశంపై మరోసారి స్పందించిన రేణు దేశాయ్.. అసలు నిజం అదే అంటూ షాకింగ్ పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకొని విడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. తన ఇద్దరి పిల్లల బాధ్యత ప్రస్తుతం రేణు దేశాయే చూసుకుంటోంది. ఇటీవల రాజకీయాల్లో బిజీ అయిన పవన్ కల్యాణ్‌ను మూడు పెళ్లిళ్లు అంటూ తరచూ విమర్శించడం, ఈ పెళ్లిళ్లపై సినిమాలు తీయబోతున్నామని అధికార వైసీపీ నేతలు ప్రకటించడంతో రేణు దేశాయ్ స్పందించి వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో రేణు దేశాయ్‌కి జనసేన నుంచి డబ్బులు ముట్టాయని, అందుకే మళ్లీ పవన్ కల్యాణ్‌పై పాజిటివ్ కామెంట్స్ చేస్తోందని విమర్శించారు.
తాజాగా.. దీనిపైనా రేణు దేశాయ్ స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘‘నా విడాకుల విషయంలో నా మాజీ భర్త ఎలా మోసం చేశాడనే వాస్తవాన్ని గతంలో చెప్పినప్పుడు ఆయన అభిమానులు చాలా దారుణంగా అబ్యూస్ పదాలతో తిట్టారు. ఇప్పుడు దేశ పౌరురాలిగా నేను అతనికి అనుకూలంగా కొన్ని మాటలు మాట్లాడినప్పుడు అతన్ని ద్వేషించేవారు ఇప్పుడు ఎలా అనుకూలంగా మాట్లాడారు అంటూ నన్ను దుర్భాషలాడుతున్నారు. విడాకుల విషయంలో నా భర్త గురించి అప్పట్లో నేను మాట్లాడింది నిజం. ఆరోజు అలా మాట్లాడినందుకు కొందరి నుంచి డబ్బు తీసుకున్నానని పవన్ అభిమానులు ఆరోపించారు. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా నన్ను దూషించారు. కూడా.. ఇప్పుడు కూడా మళ్లీ అలాంటిదే నా విషయంలో జరుగుతుంది. నా మాజీ భర్తకు అనుకూలంగా ఉండే వ్యక్తులు నాకు డబ్బు ఇచ్చారని కొందరు ఆరోపిస్తున్నారు. అందులో నిజం లేదు. నా మాజీ భర్త గురించి నేను అప్పుడు, ఇప్పుడు రెండు సందర్భాల్లో నిజాన్నే తెలిపాను. అతనితో ప్రేమలో పడి నిజం మాట్లాడినందుకు నేను చెల్లించాల్సిన మూల్యం ఇదేనని అనుకుంటున్నా. ఇది నా విధి అయితే అలాగే ఉండనీయండి. దయచేసి నాపై దర్భాషలాడకండి’’ అంటూ రాసుకొచ్చింది.