- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుస్తెలతాడు దొంగ అరెస్ట్
దిశ, వరంగల్ టౌన్ : మహిళ మెడలో పుస్తెల తాడు లాక్కుని పారిపోయిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ వివరాలను మామునూరు ఏసీపీ బి. తిరుపతి విలేకరులకు వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హకుంసింగ్ లోధి కాలిక్యులేటర్లు రిపేరు చేస్తామంటూ పలు షాపుల్లో తిరిగేవాడు. ఈ క్రమంలో దొంగతనానికి అనువుగా ఉన్న షాపులను ఎంచుకునేవాడు. ఇదే క్రమంలో డిసెంబర్ పదో తేదీన మధ్యాహ్నం ఇందిరమ్మ కాలనీ `2లో కొండపర్తి సుమలత కు చెందిన కిరాణాషాపులోకి వెళ్లాడు. సిగరెట్ కొన్నాడు. షాప్ లో ఆమె ఒక్కతే ఉండడాన్ని గమనించిన లోధి ఆమె చిల్లర ఇచ్చే క్రమంలో ముఖంపై కారంపొడి చల్లాడు. ఆమె మెడలోని పుస్తెల తాడు తెంపుకుని పారిపోయాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు హుకుం సింగ్ లోధిని ఎట్టకేలకు పట్టుకున్నారు. అతడిని రెండున్నర తులాల పుస్తెలతాడును రికవరీ చేసినట్లు ఏసీపీ తిరుపతి పేర్కొన్నారు. సీఐ రాఘవేందర్, ఎస్సై శ్రీకాంత్‌ను అభినందించారు.