- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేను పెళ్లి చేసుకోబోయే అతన్నీ చూసేసుకున్నా.. ఆ హీరోల పేరు బయటపెట్టిన అనుష్క!
దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సూపర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, తన నటన, అందంతో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. ఇక అరుంధతి లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తర్వాత అనేక సినిమాల్లో నటించినా, ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు ఎక్కువగా అవకాశాలు రావడం లేదని టాక్. ఇదంతా పక్కన పెడితే అనుష్కకు సంబంధించిన అనేక వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా అనుష్క పెళ్లి ఎప్పుడూ నెట్టింట్లో హాట్ టాపిక్‌నే. కాగా, తాజాగా అనుష్క శెట్టికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.
గతంలో నటి జయప్రదతో జరిగిన ఇంటర్వ్యూలో ఆమె తన పెళ్లి గురించి ఓపెన్ అయ్యింది. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడగ్గా, నేను వచ్చే మూడేళ్లలోపు పెళ్లి చేసుకుంటాను. ఆల్రెడీ నాకు కాబోయే వాడిని కూడా చూసుకున్నాను, కానీ ఆయన పేరు ఇప్పుడు రివీల్ చేయను, సరైన సమయంలో మేము మా పెళ్లి గురించి ఓపెన్ అవుతాం. లేకపోతే సోషల్ మీడియాలో రచ్చ అవుద్దీ, ఇప్పటికే వీరు నాకు ఐదుగురు హీరోలతో, సుమంత్, ప్రభాస్,గోపిచంద్ వంటి వారితో పెళ్లి చేశారు. ఆఖరికి కెమెరామెన్ ని కూడా వదల్లేదు అంటూ తెలిపింది. అప్పటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.