- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nagababu:‘జాతీయ అవార్డు వచ్చే అవకాశం ఉంది’.. 50 డేస్ రన్ సందర్భంగా నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: బాల్యాన్ని గుర్తు చేసి కన్నీళ్లు పెట్టించిన కమిటీ కుర్రాళ్లు చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డు బ్రేక్ చేసింది. ఊహించని విధంగా భారీ వసూళ్లు రాబట్టింది. మొదటిసారిగా మెగా డాటర్ నిహారిక సమర్పణలో తెరకెక్కి ఏకంగా థియేటర్లలో 50 రోజులు ఆడటం విశేషం. ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించారు. ఏకంగా 11 మంది కుర్రాళ్లతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంతా ఇండస్ట్రీకి కొత్తగా పరిచయమైనవారే. అయినా అద్భుతంగా నటించి తెలుగు ప్రజల్ని కట్టిపడేశారు. కంటెంట్ బాగుంటే చిన్న సినిమా అయినా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలుస్తుంని కమిటీ కుర్రోళ్లు చిత్రం మరోసారి నిరూపించింది. అయితే మెగా డాటర్ తొలిసారిగా నిర్మించిన ఈ మూవీ విడుదలై 50 రోజులు కంప్లీట్ చేసుకున్న నేపథ్యంలో నిన్న (సెప్టెంబరు 30) హైదరాబాదులో ఓ కార్యక్రమం నిర్వహించారు.
ఈ వేడుకకు దిల్ రాజు, నాగబాబు అతిథులుగా అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడారు. ఈ మూవీ చూసినప్పుడు బాల్యంలోని జ్ఞాపకాలే గుర్తొచ్చాయని తెలిపారు. జాతీయ అవార్డు సాధించడానికి అన్ని అర్హతలున్న చిత్రమిది అని కొనియాడారు. అవార్డు వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. డైరెక్టర్ యదు వంశీ అద్భుతంగా రూపొందించారని అన్నారు. కాగా ఇంత మంచి కంటెంట్ ఉన్న సినిమాను నిహారిక నిర్మించడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని వెల్లడించారు. అలాగే దర్శకుడు మాట్లాడుతూ.. కమిటీ కుర్రాళ్లు అందరికీ నచ్చుతుందని అనుకున్నాం కానీ.. 50 డేస్ రన్ అవుతుందని అస్సలు ఊహించలేదని వివరించారు. ఇక చిత్రబృందం సాంకేతిక బృందానికి 50 డేస్ మెమొంటోని అందించి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు.