రష్మి చేసేవన్నీ లంగ పనులంటూ నెటిజన్ అసభ్యకర వ్యాఖ్యలు.. గట్టిగా ఇచ్చి పడేసిన హాట్ యాంకర్

by Hamsa |   ( Updated:2024-01-27 07:17:42.0  )
రష్మి చేసేవన్నీ లంగ పనులంటూ నెటిజన్ అసభ్యకర వ్యాఖ్యలు.. గట్టిగా ఇచ్చి పడేసిన హాట్ యాంకర్
X

దిశ, సినిమా: యాంకర్ రష్మి బుల్లితెరపై పలు షోస్‌లో మెరుస్తూ అందరినీ అలరిస్తోంది. అలాగే సినిమాల్లోనూ ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు వివాదాస్పద పోస్టులతో నిత్యం ట్రోలింగ్‌ను ఎదుర్కొంటుంది. అలాగే జంతువులపై ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగినా సోషల్ మీడియాలో స్పందిస్తూ వాటిని కాపాడుతుంది. అయితే ఇటీవల జనవరి 22న అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాను కూడా ఇంట్లో కాషాయ చీర ధరించి శ్రీరాముడికి పూజ చేస్తున్నట్లు రష్మీ ఓ పోస్ట్ ద్వారా తెలిపింది. అంతేకాకుండా తనని ఎంతమంది ట్రోల్ చేసినా తాను చేసే పనులు చేస్తూనే ఉంటానని రష్మీ చెప్పుకొచ్చింది.

జనవరి 22న రెండో దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలని.. శ్రీరాముడు, సీతా మాత తమ ఇంటికి తిరిగి వచ్చిన శుభ సందర్భం ఇది అంటూ రష్మీ ట్వీట్ చేసింది. అప్పటి నుంచి రష్మీకి సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదురవుతూనే ఉంది. అయినా వాటిని పట్టించుకోకుండా ఈ అమ్మడు తన పని తాను చేసుకుంటోంది. తాజాగా, ఓ నెటిజన్ రష్మిపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ పెట్టాడు. ‘చేసేవన్నీ లంగా పనులు.. కానీ కాషాయ చీర కట్టుకుని జై శ్రీరామ్ అంటే చేసిన అన్ని లంగా పనులు తుడిచి పెట్టుకుని పోతాయా? అంటూ రాసుకొచ్చాడు.

ఇక ఆ పోస్ట్ చూసిన రష్మి స్ట్రాంగ్‌గా రిప్లై ఇచ్చింది. ‘‘నేను బిల్లులు కట్టకుండా ఎగ్గొట్టానా ? నా తల్లి దండ్రులను కుటుంబాన్ని రోడ్డు మీద వదిలేశానా ?నేను ట్యాక్సులు కట్టడం లేదా ? నేను ఏమైనా ఇల్లీగల్ పనులు చేస్తున్నానా ?ఒక వేళ అలాంటి పనులు చేస్తున్నట్లైతే నాపై కేసులు పెట్టండి. అసలు మీ దృష్టిలో లంగా పనులు అంటే ఏంటి ? కాషాయం చీర కట్టుకుని రామ నామ స్మరణలో ఉంటే నన్నెందుకు రెచ్చగొడుతున్నారు ? ధర్మాన్ని, కర్మని ఆధ్యాత్మికంగా బ్యాలెన్స్ చేయడమే సనాతన ధర్మం గొప్పతనం’’ అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం రష్మి చేసిన పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Advertisement

Next Story