- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ హీరోయిన్ ఒంటి పుట్టుమచ్చలపై నెట్టింట చర్చ: బుద్ది మార్చుకోమని వార్నింగ్
దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ర్టీలో ప్రస్తుతం నటి పుట్టుమచ్చలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ ఇష్యూపై మహిళలు, సంప్రదాయవాదులు సినిమాల్లో వాడుతున్న లాంగ్వేజ్ పట్ల, అలాగే జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ - నేహా శెట్టి జంటగా నటించిన తాజా సినిమా 'డీజే టిల్లు'. కాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న వివాదాస్పదమైంది. ట్రైలర్‌లో హీరోయిన్‌కు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయని హీరో ప్రశ్నించగా.. పదహారు అని సమాధానం చెప్తుంది. అయితే ఈ డైలాగ్‌ను రిపీట్ చేసిన ఓ ప్రముఖ జర్నలిస్ట్.. నిజంగానే ఎన్ని పుట్ట మచ్చలు ఉన్నాయో తెలుసుకున్నారా? అంటూ హీరోను అందరిముందే ప్రశ్నించాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన సిద్ధు.. ఆ విషయాన్ని వదిలేయండి అని చెప్పేశాడు.
https://twitter.com/iamnehashetty/status/1488862525756088322?s=20&t=Fzgn4uVVaxMW8r2Ut2U9xQ
కానీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఈ సినిమా నటి నేహ.. ఈ వీడియోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ అసహనం వ్యక్తం చేసింది. 'ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో ఇలాంటి ప్రశ్నలు అడగడం చాలా దురదృష్టకరం. దీన్ని బట్టి చూస్తే అతను తన చుట్టూ ఉండే మహిళలను, ఇంట్లో వారిని ఎలా గౌరవిస్తున్నాడో అర్థమవుతోంది' అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అంతేకాదు సోషల్ మీడియాలో జర్నలిస్ట్ తీరుపై విమర్శలు ఎదురవుతున్నాయి. దీంతో ఈ విషయంపై స్పందించిన నిర్మాత నాగవంశీ.. ఇలా జరగడం దురదృష్టకరమని క్షమాపణలు చెప్పాడు. కాగా ఈ చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.
https://twitter.com/Ustaadh_RC/status/1489105885687590912?s=20&t=Fzgn4uVVaxMW8r2Ut2U9xQ