నిత్యా మీనన్ అలా పిలుస్తూ అవమానించిన హీరో!

by Prasanna |   ( Updated:2023-06-10 07:36:31.0  )
నిత్యా మీనన్  అలా పిలుస్తూ అవమానించిన హీరో!
X

దిశ, సినిమా: స్టార్ నటి నిత్యామీనన్ దొరికిన ప్రతి సినిమా చెయ్యకుండా చాలా సెలెక్టివ్‌గా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషిస్తూ ముందుకు సాగుతోంది. అయితే ఆమె నటించిన మొదటి చిత్రం ‘అలా మొదలైంది’. ఇందులో నానికి జంటగా నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆ చనువుతోనే నిత్యను తరచు పొట్టి దాన, పొట్టి అని నాని పిలుస్తుంటాడట. అలా ఓ షూటింగ్‌లో కూడా పిలవడంతో కొపంతో నాని మీద గట్టిగా అరిచిన నిత్యా.. బకెట్ వాటర్ గుమ్మరించి అక్కడినుంచి వెళ్లిపోయిందట. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Advertisement

Next Story