Imran Hashmi: నటుడు ఇమ్రాన్‌ హష్మీకి గాయం.. ఆసుపత్రికి తరలింపు

by Shiva |   ( Updated:2024-10-07 16:13:20.0  )
Imran Hashmi: నటుడు ఇమ్రాన్‌ హష్మీకి గాయం.. ఆసుపత్రికి తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ (Imran Hashmi)కి గాయాలయ్యాయి. అడవి శేష్ కథనాయకుడిగా తెరకెక్కుతున్న గూఢచారి-2 (Gudachari-2) మూవీ యాక్షన్ సీక్వెన్స్‌ను హైదరాబాద్‌ (Hyderabad)లో షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకచోటు నుంచి మరోచోటికి దూకుతుండగా ఇమ్రాన్ మెడకు అనూహ్యంగా గాయమైంది. దీంతో అప్రమత్తమైన చిత్ర యూనిట్ ఆయనను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇమ్రాన్ సేఫ్‌గానే ఉన్నాడని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. అయితే, గూఢచారి-2 (Gudachari-2) మూవీలో ఇమ్రాన్ హష్మీ (Imran Hashmi) నెగిటివ్ రోల్ పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు గాయామైన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వినయ్ కుమార్ సిరిగినీడి డైరెక్ట్ చేస్తుండగా.. అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

Advertisement

Next Story