ఈ బాధను ఎలా తట్టుకోవాలో తెలియట్లేదు.. ఇలియానా ఎమోషనల్ పోస్ట్

by sudharani |   ( Updated:2023-10-04 12:34:12.0  )
ఈ బాధను ఎలా తట్టుకోవాలో తెలియట్లేదు.. ఇలియానా ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న నటి ఇలియానా మరో ఎమోషనల్ పోస్ట్‌తో నెటిజన్లను కలవరపెట్టింది. తాను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి తన హెల్త్ అండ్ బేబీకి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటున్న ఆమె.. రీసెంట్ పండంటి మగబిడ్డకు జ్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాబుకు ఆరోగ్యం బాగోలేదంటూ భావోద్వేగానికి లోనవుతూ ఇన్‌స్టా స్టోరీస్‌లో బిడ్డను ఎత్తుకున్న ఫొటో షేర్ చేసింది.

‘మన బిడ్డలకు ఆరోగ్యం బాగోలేకపోతే మనం అనుభవించే బాధ ఎలా తట్టుకోవాలో ఎవరూ నేర్పించలేదు. కోవా ఫినిక్స్ డోలన్‌కు ఒంట్లో నలతగా ఉండటంతో రోజంతా ఎత్తుకునే ఉన్నాను. లాలిస్తూ, ఆడిస్తూ బాబుతోనే పూర్తి సమయం గడిపాను’ అంటూ తన పీలింగ్స్ రాసుకొచ్చింది. ప్రజంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా అమ్మ గొప్పతనంపై పాజిటీవ్ కామెంట్స్ చేస్తున్న ఫ్యాన్స్, నెటిజన్లు బాబు తొరగా కోలుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story