Ileana D'Cruz : అప్పుడే మరో శుభవార్త చెప్పిన ఇలియానా మరి ఇంతా ఫాస్ట్‌గానా..

by sudharani |   ( Updated:2023-10-05 11:51:22.0  )
Ileana DCruz : అప్పుడే మరో శుభవార్త చెప్పిన ఇలియానా మరి ఇంతా ఫాస్ట్‌గానా..
X

దిశ, సినిమా: హీరోయిన్ ఇలియానా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ‘దేవదాసు’ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన ఈ గోవా బ్యూటీ.. మహేష్ బాబు సరసన నటించిన ‘పోకిరి’ మూవీతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక మూవీస్ విషయాలు పక్కనపెడితే ఇలియానా పెళ్లి కాకుండానే ఆగస్టు 1న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇలా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్న ఇలియానా తన ప్రెగ్నెన్సీకి కారణమైనటువంటి వ్యక్తి గురించి మాత్రం ఎప్పుడు, ఎక్కడ చెప్పలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఇలియాన మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్ని రోజులుగా అవకాశాల కోసం ఎంతగానో ప్రయత్నించిన తనకు తాజాగా ఒక వెబ్ సిరీస్‌లో నటించే అవకాశం వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ తన సిరీస్‌లో నటించమని స్వయంగా ఫోన్ చేసి అవకాశం ఇచ్చాడని తెలుస్తుంది. దీంతో నెటిజన్లు కొడుకు తెచ్చిన అదృష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story