తన దగ్గరచిల్లిగ‌వ్వ లేకున్నా ఫ‌ర్వాలేదు.. అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా : Tripti Dimri

by Kavitha |   ( Updated:2024-02-01 06:47:09.0  )
తన దగ్గరచిల్లిగ‌వ్వ లేకున్నా ఫ‌ర్వాలేదు.. అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా : Tripti Dimri
X

దిశ, సినిమా: ‘యానిమల్’ మూవీ తో బాబి టు గా ఓవర్ నైట్ లో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది త్రిప్తి దిమ్రీ. అంత‌కుముందు ఎన్నో సినిమాలు చేసిన రాని గుర్తింపు ఆమెకుఈ ఒక్క చిత్రంతో వచ్చింది. దీంతో అమ్మడు కి వరుస ఆఫర్‌లు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే తెలుగులో రెండు చిత్రాల‌కు సైన్ చేయగా.. నాలుగు బాలీవుడ్ చిగ్రాల‌ను లైన్‌లో పెట్టిన‌ట్టు స‌మాచారం. అయితే ఈ మధ్య త్రిప్తి త్వర‌లోనే పెళ్లి చేసుకోబోతుంద‌నే వార్త నెట్టింట బాగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హాట్ బ్యూటీ తన పెళ్లి గురించి వైరల్ కామెంట్స్ చేసింది. ‘ జీవితంలో డబ్బు, కీర్తి ప్రతిష్ఠలు వాటంతట అవే వస్తాయి.. వాటి వెంట పరిగెత్తాల్సిన అవసరం లేదు. అతని దగ్గర చిల్లిగ‌వ్వ లేకున్నా ఫ‌ర్వాలేదు కానీ మంచి మనసు ఉండాలి. అలాంటి వ్యక్తినే పెళ్లాడతా. కానీ ఇప్పుడు మాత్రం పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. కెరీర్ పై ఫోకస్ చేస్తున్నా.మరో ఏడెనిమిదేళ్ల కి చేసుకుంటా ’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఈ త్రిప్తి.. అనుష్క శర్మ సోదరుడు, నిర్మాత కర్నేశ్ శర్మతో ఈ బ్యూటీ డేటింగ్ లో ఉన్నట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed