Dasara 2 : దసరా 2 హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Prasanna |   ( Updated:2024-08-29 14:05:32.0  )
Dasara 2 : దసరా 2 హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
X

దిశ, వెబ్ డెస్క్: నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. 2023లో నాని హీరోగా నటించిన దసరా, హాయ్ నాన్నసినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ రెండు మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి. వీటిలో దసరా సినిమాకి నేషనల్ అవార్డులు ..కూడా అంచుకున్నాడు.

ఈ రోజు సరిపోదా శనివారం మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. ఉదయం నుంచి మిక్స్డ్ టాక్ తో రన్ అవుతుంది. రేపటి వరకు కానీ సినిమా రిజల్ట్ తెలియదు. కానీ, నాని రూటే సెపరేట్.. మూవీ హిట్/ ఫ్లాప్ అనేది పట్టించుకోకుండా ఫ్యాన్స్ ను, ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాడు. ఇప్పుడు, నాని చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో దసరా సీక్వెల్ కూడా ఉంది.

దసరా 2 గా రానున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుందని ఎన్నో రూమర్స్ వచ్చాయి. కానీ, తాజాగా ఇప్పుడు ఇంకో వార్త బయటకు వచ్చింది. కీర్తి సురేష్ నే ఫైనల్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఈ క్రమంలోనే దసరా 2 మూవీలో వీళ్ళిద్దరి కాంబో రిపీట్ అవుతుందని తెలిసిన సమాచారం. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story