- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మృణాల్ ఆహారపు అలవాట్లు తెలిస్తే.. ఓ మై గాడ్ అనకుండా ఉండలేరు?
దిశ, సినిమా: బుల్లితెరతో తన కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ "సీతారామం" సినిమాతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ ముద్దుగుమ్మ మొదటి మూవీతోనే హిట్ కొట్టి మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత నానితో నాన్న సినిమాలో నటించింది. ఈ చిత్రం కూడా పెద్ద హిట్ అయింది.. దీంతో డైరెక్టర్స్, నిర్మాతలు ఈమె డేట్స్ కోసం వెంట పడ్డారు.. కానీ, ఈ ముద్దుగుమ్మ నా రూటే సెపరేట్ అంటుంది.. కథలో ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉంటే తప్ప సినిమాలు చేయదు.
స్టార్ ఫ్యామిలీ సినిమాతో ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైన మృణాల్ ఠాకూర్ కొత్త ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. అయితే, తాజాగా ఈమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫుడ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈమె చెప్పిన ఫుడ్ కాంబినేషన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
కొన్ని విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్లను ప్రయత్నించానని మృణాల్ ఠాకూర్ చెప్పింది. ఇంతకీ మీరు ట్రై చేసిన ఫుడ్ కాంబినేషన్లో ఒకటి చెప్పండని యాంకర్ అడగగా.. మృణాల్ ఠాకూర్ వెంటనే.. నేను అన్నంతో ఐస్ క్రీమ్ తిన్నానని చెప్పింది. నేను కొంచెం రైస్ తో వెనీలా ఐస్ క్రీమ్ కలుపుకుని తిన్నాను.. కానీ, అదేం బ్యాడ్ గా.. అనిపించలేదు. కానీ మా ఫ్రెండ్స్ మాత్రం.. క్రేజీ కాంబినేషన్ అంటారు. మీరు ట్రై చేయండి.. టేస్ట్ చాలా బావుంటుందని చెప్పుకొచ్చింది.