- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ కండీషన్‌కు ఒప్పుకుంటే ఎన్టీఆర్ సినిమాలో నటిస్తా.. : రష్మిక
దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 చేస్తున్నారు. ఈ సినిమా పై అటు బాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. వీటితో పాటు పాటు పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.
ఈ మూవీని అనౌన్స్ చేసి చాలా కాలం గడిచిపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నిర్మాణ పనులు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా నేషనల్ రేంజ్లో పాపులర్ అయిన రష్మిక మందనను ఎంపిక చేసారు. అయితే, ఎన్టీఆర్ కు రష్మిక కొన్ని కండిషన్స్ పెట్టిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో తాను గ్లామర్ పాత్రలో నటించనని మొఖం మీదే చెప్పిందని సమాచారం. కానీ, పుష్ప మూవీలో రష్మిక గ్లామర్ పాత్రలో నటించింది. మళ్లీ గ్లామర్ పాత్రలో కనిపించేందుకు సిద్ధంగా లేదని వినిపిస్తోంది.
ప్రశాంత్ నీల్ ఆమెను హీరోయిన్‌గా చేయాలని పట్టుబట్టడంతో ఆమె ఓకే చెప్పిందని టాక్. ఈ సినిమా కోసం రష్మిక ఏకంగా రూ. 7 కోట్లు తీసుకుంటుంది. నిర్మాతలు కూడా ఆమె అడిగింది ఇవ్వడానికి రెడీ అయ్యారు.