బాలీవుడ్‌కు పోతే నా బట్టలిప్పించేవారు.. స్త్రీ శరీరాలనే ఉపయోగిస్తున్నారు.. పాయల్ సంచలన ట్వీట్

by Hamsa |   ( Updated:2023-10-02 07:01:20.0  )
బాలీవుడ్‌కు పోతే నా బట్టలిప్పించేవారు.. స్త్రీ శరీరాలనే ఉపయోగిస్తున్నారు.. పాయల్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: నటి పాయల్ ఘోష్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ సినిమాలో తమన్నా ఫ్రెండ్‌గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసింది. ఒకప్పుడు ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతాడని, ప్రపంచమంతా కూడా ఆయన నటన గురించి మాట్లాడుకుంటుందని చెప్పింది పాయల్. ఆమె చెప్పినట్టుగానే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ నటన గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంది. నేను ఈ మాటలను మూడేళ్ల క్రితం చెప్పాను.. అప్పుడు నన్ను ఎవ్వరూ నమ్మలేదు.. ఇప్పుడు అదే నిజమైంది.. నాడు నేను అలా అంటే.. అందరూ నన్ను చూసి నవ్వారు అంటూ మళ్లీ కౌంటర్లు వేసింది పాయల్ ఘోష్.

తాజాగా, ఈ అమ్మడు తన ట్విట్టర్ వేదికగా సంచలన పోస్ట్ షేర్ చేసింది. ‘‘ ఆ దేవుడి దయ వల్ల నేను సౌత్ ఇండస్ట్రీ నుంచి లాంచ్ అయ్యాను. అదే ఒక వేళ బాలీవుడ్ నుంచి అయి ఉంటే.. వారు నా బట్టలిప్పించే వారు.. ఇక్కడ అమ్మాయిల క్రియేటివిటీ, టాలెంట్ కంటే శరీరాలనే ఉపయోగిస్తున్నారు’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం పాయల్ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇక ఈ ట్వీట్ ఎన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి మరి.

Advertisement

Next Story

Most Viewed