- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..!
దిశ, వెబ్‌డెస్క్: ‘పుష్ప’ సినిమాతో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం ‘పుష్ప-2’ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా భారీ అంచనాలు ఉండగా.. దాదాపు వెయ్యి కోట్లు బిజినెస్ జరుగుతుందని టాక్. ఇక ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్.. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే.. జాతీయ అవార్డు అనంతరం బన్నీ రేంజ్ అమాంతం పెరిగిపోయింది.
అంతే కాదు తెలుగుతో పాటు కోలీవుడ్, మాలీవుడ్ మిగతా అన్ని భాషల్లో కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. ఆ భాషల్లో సైతం బన్నీ ఎంట్రీ ఇవ్వాలని అక్కడి అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. దీంతో అల్లు అర్జున్ కూడా అక్కడ ఎంట్రీ ఇచ్చేందుకు సరైన కథ కోసం ఎదురుచూస్తున్నట్లు టాక్. ఈ క్రమలోనే వరుస హిట్‌లతో దూసుకుపోతున్న డైరెక్టర్‌తో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు బన్నీ రెడీగా ఉన్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.
అందుతున్న సమాచారం మేరకు.. రాజారాణి సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న డైరెక్టర్ అట్లీ కుమార్.. విజయ్‌తో వరుసగా తీసిన మూడు సినిమాలతో మంచి విజయాలను అందుకుని హిట్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్‌లో సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు అట్లీ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ మేరకు అల్లు అర్జున్‌కి మంచి కథ ఉందని.. వినాలని కోరినట్లు సమాచారం. అదే కనుక నిజం అయితే.. వరుస హిట్‌లతో దూసుకుపోతున్న డైరెక్టర్‌తో బన్నీ కోలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ కన్ఫార్మ్ అయినట్లే అని టాక్. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో వేచి చూడాల్సి ఉంది.