లాస్ట్ 30 డేస్ లైఫ్‌లో ఎప్పటికీ మరిచిపోలేను.. గొప్ప అనుభూతినిచ్చిందంటున్న హాట్ బ్యూటీ

by Satheesh |   ( Updated:2023-10-23 14:13:14.0  )
లాస్ట్ 30 డేస్ లైఫ్‌లో ఎప్పటికీ మరిచిపోలేను.. గొప్ప అనుభూతినిచ్చిందంటున్న హాట్ బ్యూటీ
X

దిశ, సినిమా: హాట్ బ్యూటీ హనీరోజ్ తన అప్ కమింగ్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ‘వీరసింహా రెడ్డి’ విజయంతో వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్న నటి.. త్వరలోనే ‘రాహేలు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నట్లు చెబుతూ నెట్టింట ఆసక్తికరమైన ఫొటో షేర్ చేసింది. ‘గడిచిన 30 రోజులు నా లైఫ్‌లో ఎప్పటికీ మరిచిపోలేని ఒక చాప్టర్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయినా మూవీలో భాగమవడం ప్రమ్యేకమైన అనుభవం. నా 18 ఏళ్ల సినీ జీవితంలో మొదటిసారి ఇలాంటి ఒక గొప్ప మహిళా దర్శకురాలితో కలిసి పనిచేసినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. టోటల్ మూవీ టీమ్‌కు కృతజ్ఞతలు’ అంటూ తన ఫీలింగ్స్ పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా హనీ అందాలను ఆస్వాదించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటున్నారు ఫ్యాన్స్.

Advertisement

Next Story