Shocking news: ‘రాహుల్ గాంధీతో డేటింగ్ చేస్తా’ షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్

by Anjali |   ( Updated:2024-08-01 08:49:37.0  )
Shocking news: ‘రాహుల్ గాంధీతో డేటింగ్ చేస్తా’ షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: రెఫ్యూజీ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్. అదే ఏడాదిలో ఈ భామ అద్భుతమైన నటనకు కభీ ఖుషీ కభీ గమ్ సినిమాలో అవకాశం వచ్చింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో కరీనాకు బాలీవుడ్‌లో తిరుగే లేకుండా పోయింది. బాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుని.. అగ్ర హీరోల సరసన నటించి అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. తర్వాత నటుడు సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లి చేసుకుంది.

ఇదంతా పక్కన పెడితే ఈ బాలీవుడ్ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. అయితే కామన్‌గా కథానాయికలు అగ్ర హీరోలతో డేటింగ్ చేయాలనుకుంటారు కదా? కానీ ఈమె భిన్నంగా ఓ ప్రముఖ రాజకీయ నాయకుడితో డేటింగ్ చేయాలని ఉందని ఇంటర్వ్యూలో సంచలన విషయం రివీల్ చేసింది. ఆ రాజకీయ నాయకుడేవరో కాదు.. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ. కరీనాను ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా.. ‘నేను డేటింగ్ చేయానుకుంటోన్న వ్యక్తి పేరు చెబితే వివాదం వస్తుంది’ అని అంటూనే రాహూల్ గాంధీ అని పేరు చెప్పుకొచ్చింది. అప్పటి కరీనా కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట స్ప్రెడ్ కావడంతో షాక్ అవుతూ పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

Next Story