- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ANR మనవడిగా పుట్టడం నా అదృష్టం: Naga Chaithanya Emotional Comments
దిశ, వెబ్‌డెస్క్: నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరావు జయంతి ఉత్సవాల్లో మనవడు నాగచైతన్య.. ఏఎన్నార్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ‘‘ఏన్నార్ అంటే తెలుగు పరిశ్రమలో, ప్రేక్షకుల్లో గొప్ప నటుడిగా, క్లాసిక్ ఐకానిక్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. ఆయన నటించిన చిత్రాలు, కొత్త జానర్లలో ఉండేవన్నారు. ఏఎన్నార్ చేసిన రిస్కులు ఎనలేనివన్నారు. ఇప్పటికీ ఫిల్మ్ స్కూల్‌లో ఏఎన్నార్‌ను ఇన్పైరింగ్ కేస్ స్టడీగా చదువుతుంటారంటారన్నారు. నేను కూడా ఆ లిస్టులో ఒకడిని అని తెలిపారు. ‘మనం’ మూవీలో తాతతో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
అది నా జీవితంలో, కెరీర్‌లోనే హైపాయింట్. తాత ఎప్పుడూ నాలో దీపంలా వెలుగుతూనే ఉంటారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అక్కినేని ఫ్యాన్స్‌కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనం ఎక్కడ పుడుతామో.. ఎవరికి పుడుతామో మన చేతిలో ఉండదు. అక్కినేని నాగేశ్వర్ రావు మనవడిగా పుట్టడం నా అదృష్టం. తాత లెగసీ అదే స్టేజ్‌లో కొనసాగుతుంది. ఆయన మనలోనే జీవించి ఉన్నారు.’ అంటూ చైతూ ఏఎన్నార్ గురించి చెబుతూ భావోద్వేగమయ్యారు. ఇక ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు మోహన్ బాబు, బ్రహ్మానందం, మహేశ్ బాబు, రామ్ చరణ్, జయసుధ, జగపతి బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తదితరులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి : ANR శత జయంతి వేడుకల్లో Jayasudha పై సీరియస్ అయినా Mohan Babu.. (వీడియో)