- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నాకేమో ఆ సినిమాలు చేయడం ఇష్టం.. కానీ సౌత్ ఆడియన్స్ పట్టించుకోరు.. ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు
దిశ, సినిమా: 'కలియుగ పాండవులు' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఖుష్బూ అందరికీ సుపరిచితమే. ఈమె తన మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలతో బంపర్ హిట్లు కొట్టి స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. అలాగే తమిళ, కన్నడ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఖుష్బూ ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా కొనసాగుతుంది. తన భర్త దర్శకత్వంలో తెరకెక్కించే సినిమాలకు ఖుష్బూ నిర్మాతగా వ్యవహరిస్తుంది. రీసెంట్ గా ఈమె నిర్మాతగా చేసిన అర్నమలై-4 సినిమా రిలీజై తమిళనాట ఘన విజయం సాధించింది. తెలుగులో బాక్ పేరుతో రిలీజైంది కానీ పెద్దగా ఆడలేదు.
కాగా తాజాగా ఖుష్బూ ఇచ్చిన ఇంటర్వూలో సౌత్ సినిమాల గురించి మాట్లాడుతూ.. సౌత్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకు అసలు డిమాండ్ ఉండదని.. హిందీ సినిమాలు 'డార్లింగ్స్', 'క్రూ' లాంటి కాన్సెప్ట్ లు ఇక్కడ చేయాలనుకుంటున్నానని, కానీ సౌత్ లో అలాంటి కాన్సెప్ట్ సినిమాలను ఆడియన్స్ పట్టించుకోరని తెలిపింది ఖుష్బూ. హిందీలో బంపర్ హిట్టయిన 'బధాయి హోను' తమిళంలో రీమేక్ చేస్తే పెద్దగా విజయం సాధించలేదని.. ఇలాంటి సినిమాలు ఇక్కడ ఆదరించడానికి కాస్త టైమ్ పడుతుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఖుష్బూ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.