Salman Khan: తాను ఇష్టపడ్డ అమ్మాయి కూడా భాయ్ అని పిలిచిందట.. సల్మాన్ ఖాన్ కామెంట్స్ వైరల్!

by Prasanna |   ( Updated:2023-04-29 07:45:09.0  )
Salman Khan: తాను ఇష్టపడ్డ అమ్మాయి కూడా భాయ్ అని పిలిచిందట.. సల్మాన్ ఖాన్ కామెంట్స్ వైరల్!
X

దిశ, సినిమా: బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే.. వెంటనే మైండ్‌లోకి వచ్చే పేరు సల్మాన్ ఖాన్. ఐదు పదుల వయసు మీద పడినా ఇంకా పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం. అయితే సల్మాన్ పలువురు హీరోయిన్స్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ మాత్రం పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి. ఇక తాజాగా తన రిలేషన్‌షిప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు సల్మాన్ ఖాన్. ‘‘నాకు ప్రేమలు పెద్దగా కలిసి రావడం లేదు.. ప్రస్తుతానికి నేను అందరికీ భాయ్‌ని మాత్రమే. నేను ఇష్టపడే అమ్మాయిలు నన్ను జాన్ అని పిలిస్తే బాగుండేది.. కానీ చివరికి ఆమె కూడా నన్ను భాయ్ అని పిలుస్తోంది. దానికి నేనేం చేయను?’’ అంటూ సల్మాన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story