మాజీ ప్రియుడిని ఉద్దేశిస్తూ అలా రాసిన దీప్తి.. పోస్ట్ వైరల్

by sudharani |   ( Updated:2023-01-19 15:57:07.0  )
మాజీ ప్రియుడిని ఉద్దేశిస్తూ అలా రాసిన దీప్తి.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: సోషల్ మీడియా సెలబ్రిటీ దీప్తి సునయన గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. మొదట్లో డబ్ స్మాష్ వీడియోలతో గుర్తింపు పొందింది. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్‌లతో బాగా మెప్పించి మరింత గుర్తింపు అందుకుంది. ఇక షణ్ముఖ్‌తోనూ తన రిలేషన్ షిప్‌ని బ్రేక్ చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో మొదట్లో బాగా ఎమోషనల్ అయిన దీప్తి ఇప్పుడు స్ట్రాంగ్‌గా ఉంది. ప్రస్తుతం పలు షార్ట్ ఫిలిమ్స్‌తో పాటు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక తాజాగా తను 'ఏమోనే' అనే వీడియో సాంగ్ చేయగా విడుదలైన క్షణాల్లో వైరల్ అయింది. ఈ పాటకు ఓ రేంజ్‌లో ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఈ సాంగ్ చూసిన ప్రేక్షకులు బాగుందంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆ పాట కాన్సెప్ట్‌కు ఫిదా అయిన ఓ అభిమాని 'ప్రేమించిన వాళ్లు పెళ్లి చేసుకుంటారో లేదో తెలియదు. కానీ, పెళ్లి చేసుకున్న వాళ్లు కచ్చితంగా ప్రేమించుకుంటారు' అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌ని ప్రత్యేకంగా స్క్రీన్ షాట్ తీసిన దీప్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో చాలామంది షన్ను‌ని ఉద్దేశించి పెట్టిందేమోనని చెప్పుకుంటున్నారు.


READ MORE

పంతులమ్మగా మారిన నిత్యామీనన్.. వీడియో వైరల్

Advertisement

Next Story

Most Viewed