సిగ్గులేకుండా నగ్నంగా ఉండి ఆ సీన్ చేశానంటూ.. అమీర్ ఖాన్ వైరల్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2024-04-29 08:28:13.0  )
సిగ్గులేకుండా నగ్నంగా ఉండి ఆ సీన్ చేశానంటూ.. అమీర్ ఖాన్  వైరల్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఎన్నో హిట్ చిత్రాలు అందించి స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు కోట్లు కొల్లగొట్టి బాక్సాఫీసును షేక్ చేశాయి. ఇప్పటికీ అమీర్ ఖాన్ పలు చిత్రాల్లో నటిస్తూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు. తాజాగా, ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకు హాజరైన అమీర్ ఖాన్ పీకే సినిమా సమయంలో జరిగిన పలు విషయాలను గుర్తు చేసుకున్నాడు. ‘‘ ఈ సినిమాలో ఓ సీన్‌లో పూర్తి నగ్నంగా చేయాల్సి వచ్చింది. సెట్‌లో కొంత మంది సిబ్బందితో ఆ షాట్ చేశాము. అయితే డైరెక్టర్ షార్ట్ ధరించమని చెప్పారు. కానీ నాకు అవి వేసుకుని నడవడం బాగానే నడిచా.

పరుగెత్తే సమయంలో మాత్రం చాలా ఇబ్బందిగా అనిపించింది. దీంతో డైరెక్టర్ రాజ్‌తో మాట్లాడాను. ఆ షార్ట్ తీసేసి నగ్నంగా నటిస్తా అందరినీ దూరంగా పంపమని అడిగాను. అతను ఒప్పుకున్నాడు. సెట్‌లో ఉన్న ఫోన్స్ అన్నీ దాచిపెట్టారు. కానీ నాకు నగ్నంగా చేయగలనా అని ముందు కాస్త కంగారుగా అనిపించింది. కానీ ఆ తర్వాతే పెద్ద సమస్య కాదని ముందడుగు వేశాను. సెట్‌లో నగ్నంగా నడవడం కాస్త తేడాగా అనిపిస్తుందేమోనని అనుకున్నా. సెట్‌లోకి వెళ్లాక నేను సినిమా చేయాల్సిందేనని డిసైడ్ అయ్యాను. ఈ సమయంలో నాకు సిగ్గుగా అనిపించలేదు. ఆ సీన్‌లో నగ్నంగా చేశాక సినిమాలో చూసి నేనే అలా చేశానా అని షాకయ్యాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అమీర్ ఖాన్ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

Read more : నా పిల్లలు నన్ను దేకట్లేదు.. దారుణంగా తిడుతున్నారు.. పబ్లిక్‌గా ఏడ్చిన సూపర్ స్టార్..

Advertisement

Next Story