మహేష్ బాబు సినిమా పది సార్లు చూసి ఎంపీ అయ్యాను: మల్లారెడ్డి

by Hamsa |   ( Updated:2023-11-28 06:01:18.0  )
మహేష్ బాబు సినిమా పది సార్లు చూసి ఎంపీ అయ్యాను: మల్లారెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్, కపూర్ నేషనల్ క్రష్ రష్మిక కలిసి నటించిన చిత్రం ‘యానిమల్’. దీనిని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించాడు. అయితే ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. యానిమల్ సినిమా డిసెంబర్ 1న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్’ను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గెస్టులుగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి హాజరయ్యారు.

అలాగే వీరితో పాటు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అతిథిగా విచ్చేసి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘ ఈ రోజు మల్లారెడ్డి యూనివర్సిటీకి యానిమల్ చిత్రబృందం వచ్చింది. మహేష్ బాబు గారు.. నేను మీ సినిమా బిజినెస్ మెన్ చూసి రాజకీయాల్లోకి వచ్చాను. ఈ సినిమా పది సార్లు చూసి ఎంపీ అయ్యాను. సేమ్ మోడల్.. సేమ్ సిస్టమ్. రణబీర్ నేనొక విషయం చెప్తాను. అప్పట్లోనే నేను చెప్పాను. బాలీవుడ్, హాలీవుడ్‌ను తెలుగు హీరోలు రూల్ చేస్తారు. మా తెలుగు వాళ్లు చాలా స్మార్ట్. రాజమౌళి, దిల్ రాజు.. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా వచ్చాడు. హిందుస్థానీ రూల్ చేస్తోంది. పుష్పతో అల్లు అర్జున్.. దుమ్మురేపాడు. ఇప్పుడు సందీప్ మరోసారి బాలీవుడ్‌లో దుమ్మురేపుతాడు. మల్లారెడ్డి యూనివర్సిటీ లో నాలుగు సార్లు అశ్వమేధ యాగం జరిగింది. ఇక్కడ ఇంజనీర్లు, డాక్టర్లు తయారవుతున్నారు. ఇక్కడ ఏ సినిమా రిలీజ్ అయినా కూడా 500 కోట్లు కలెక్షన్స్ వస్తాయి. సూపర్ హిట్ అందుకుంటుంది’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story