- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బేబీ’ సినిమాలో బెడ్ రూమ్ సీన్స్ వైష్ణవి తండ్రిని అడిగే చేశా.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్
దిశ, వెబ్ డెస్క్: ఆనంద్ దేవరకొండ, సాయి రాజేష్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బేబీ’ చిత్రం జూలై 14న విడుదలై భారీ విజయాన్ని సాధించింది. చిన్న సినిమాగా వచ్చిన బేబి చిత్రం అందరినీ ఆకట్టుకుంటూ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. ఇందులో హీరోయిన్‌గా వైష్ణవి చైతన్య నటించింది. ఎక్కువగా ఆమె క్యారెక్టర్‌కే ప్రేక్షకులు ఫిదా అవుతూ సినిమాను మళ్లీ మళ్లీ చూస్తున్నారు.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సాయి రాజేష్, వైష్టవి క్యారెక్టర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ బెడ్ రూమ్ సీన్‌ని వైష్ణవి చైతన్య తండ్రిని అడిగే చేశాను. ఆ సీన్ గురించి ఆయనకు పూర్తిగా వివరించాను. అలాగే మీకు నచ్చితేనే తీస్తాను. లేదంటే వేరే లాగా ట్రై చేద్దాము అని చెప్పాకే ఆ సీన్‌ను ఉంచాను. అంతేకాకుండా ఆమె పూర్తి బాధ్యత నాదే అని ఒప్పుకున్నాకే సినిమాలో అలా చేశాము’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సాయి రాజేష్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో అది తెలిసిన నెటిజన్లు డైరెక్టర్ ఇలా కూడా ఉంటారా? హీరోయిన్ తండ్రిని ఒప్పించి మరీ సీన్ తీశారా? అని ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read More: పవన్ కల్యాణ్‌ను మనమంతా కలిసి గెలిపించాలి: బ్రహ్మానందం