Anupama Parameswaran: నేను సింగిల్ కాదు మింగిల్ అంటోన్న అనుపమ పరమేశ్వరన్ ..

by Manoj |   ( Updated:2022-05-30 09:52:39.0  )
Anupama Parameswaran
X

దిశ, వెబ్‌డెస్క్: Anupama Parameswaran reveals her love matter.. 'ప్రేమమ్‌' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై, క్యూట్ లుక్స్‌తో, కర్లీ కురులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌(Anupama Parameswaran). సినిమాల్లో డీసెంట్‌ రోల్స్‌ ఎంచుకుంటూ అందం, అభినయంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. అనుపమ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫొటోలను, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో తన రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నాకు లవ్‌ మ్యారేజ్‌పై మంచి అభిప్రాయమే ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కపుల్స్‌ను చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. నాకు కూడా ప్రేమ వివాహమే చేసుకోవాలని ఉంది. మా పేరేంట్స్‌కు కూడా ఈ విషయం తెలుసు. నేను పెళ్లంటూ చేసుకుంటే కచ్చితంగా లవ్‌ మ్యారెజే చేసుకుంటా. నేను సింగిల్‌.. కాదు మింగిల్‌.. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నేనైతే ప్రేమలో ఉన్నా.. మరి అవతలి సైడ్‌ నుంచి ఏమనుకుంటున్నారో తెలియదు. ప్రస్తుతం వన్‌ సైడ్‌ లవ్‌ అని చెప్పగలను' అంటూ చెప్పుకొచ్చింది అనుపమ పరమేశ్వరన్‌. అయితే తాను ఎవరిని ప్రేమిస్తుందో మాత్రం రివీల్ చేయలేదు. కాగా అనుపమ మనసు దోచుకున్న ఆ లక్కీ ఫెలో ఎవరై ఉంటారా అని అభిమానులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ప్రస్తుతం అనుపమ కార్తికేయ 2, 18 పేజీస్‌, బటర్‌ ఫ్లై సినిమాల్లో నటిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed