వదిన చేసిన ద్రోహం కారణంగానే నేను ఇలా ఉన్నా.. Pawan Kalyan సంచలన వ్యాఖ్యలు

by Hamsa |   ( Updated:2023-08-22 04:50:26.0  )
వదిన చేసిన ద్రోహం కారణంగానే నేను ఇలా ఉన్నా.. Pawan Kalyan సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్- సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. ఈ సినిమా జూలై 28న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఆ క్రమంలో తాజాగా, చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మంగళవారం (జూలై 25న) శిల్ప కళా వేదికపై నిర్వహించారు. అయితే పవన్ కల్యాణ్ ఈవెంట్‌లో చిరంజీవి భార్య సురేఖ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

‘‘నాకు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు, ఎప్పుడూ అనుకోలేదు కూడా, ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ, పొలం పనులు చేసుకోవాలనుకున్నా. అన్నయ చిరంజీవి మెగాస్టార్‌గా ఇమేజ్‌ పొంది పీక్‌లో ఉన్నప్పుడు హీరో అవుతావా? అంటే భయమేసింది. నేను చేయగలనా అనిపించింది. కానీ మనల్ని నమ్మే వ్యక్తులు ఇంపార్టెంట్. వదిన సురేఖ నన్ను నమ్మింది. ఆమె సినిమాలు చేయమని ప్రోత్సహించింది.

ఓ సారి జగదాంబ థియేటర్ వద్ద బస్‌ ఎక్కి డ్యాన్స్ చేయమన్నారు. ఆ రోజు డ్యాన్స్ చేయడానికి నేను చచ్చిపోయాను ఏడుపొచ్చింది. నాకు పది మందిలో మాట్లాడాలన్నా, యాక్టింగ్ చేయాలన్నా సిగ్గు. ఆ రోజు ఫోన్‌ చేసి మా వదినని అడిగాను. నన్ను ఎందుకు అనవసరంగా ఎగ దోశావు. నన్ను వదిలేసి ఉంటే ఎక్కడో మారుమూల గ్రామంలో ఎవరికీ కనిపించకుండా బతికేసే వాన్ని. ఆమె ఆ రోజు చేసిన తప్పు కారణంగానే ఇప్పుడు నేను ఇలా మీ ముందు నిల్చున్నాను. మా వదిన ఆ రోజు తప్పు చేయకుండా ఉండుంటే. నా పాటికి నేను చాలా చిన్న జీవితాన్ని గడిపేవాడిని. ఆమె చేసిన ద్రోహం మాటల్లో వర్ణించలేను. దీనంతటికి కారణం వదిన చేసిన ద్రోహమే’’ అంటూ పవన్ కల్యాణ్ ఫన్నీగా చెప్పుకొచ్చారు.

Also Read: ‘RRR’ లాంటి సినిమా తీయాలి.. ఆ ఇండస్ట్రీకి Pawan Kalyan కీలక సూచన..

Advertisement

Next Story