- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నాకు కూడా ఆ కోరికలు ఉంటాయి.. రెండో పెళ్లి చేసుకుంటా.. ఎస్తేర్ షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: ‘వెయ్యి అబద్ధాలు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎస్తేర్ నోరోన్హా అందరికీ సుపరిచితమే. ఆ తర్వాత సునీల్ హీరోగా వచ్చిన ‘భీమవరం బుల్లోడు’ సినిమాలో నటించింది. ఈ మూవీలో తన నటనకు మంచి మార్కులు పడినప్పటికీ అవకాశాలు మాత్రం అనుకున్నంత రీతిలో రాలేదు. కానీ ఇటీవల వచ్చిన 69 సంస్కార్ కాలనీ, రెక్కీ వంటి రొమాంటిక్ వెబ్ సీరీస్‌లలో నటించిన ఈమెకు మంచి క్రేజ్ దక్కింది. రొమాన్స్ అనే సరికొత్త అర్దాన్ని చెప్తూ సినిమా లుక్‌నే మార్చేసింది. దీంతో ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ‘ది వేకెంట్ హౌస్’ అనే మూవీ షూటింగ్ లో బిజీగా ఉంది. దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా ఎస్తేర్ నే చేపడుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె .. మాట్లాడిన మాటలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మగవాళ్లనే అంటారు. వాళ్లు మాత్రమే కాదు ఆడవాళ్లు కూడా ఆఫర్ చేయడం ఇండస్ట్రీలో ఉంది. అయితే అవకాశాల కోసం క్యారెక్టర్ మార్చుకోను. ఈ కారణంగానే గతంలో కొన్ని సినిమాలు మిస్ అయ్యాయి. పైగా మోడ్రన్ డ్రెస్సులు వేసుకుంటే ట్రోల్ చేయడమే కాక ప్రాస్టిట్యూట్ అని ముద్ర కూడా వేస్తారు. ఆడవాళ్లకి కోరికలు ఉంటాయి. అలా కోరికలు ఉండటాన్ని ప్రస్తుతం సమాజం నేరంలా భావిస్తుంది. అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆడవాళ్లకి కూడా ఒక జీవితం ఉంటుంది. వారికి కూడా ఎమోషన్స్ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు ఎస్తేర్. అదేవిధంగా మళ్లీ పెళ్లి చేసుకుంటారా అని యాంకర్ అడగ్గా.. దానికి నాకు ఒంటరిగా ఉండాలని లేదు. రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.