RajaSaab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ‘రాజాసాబ్’ మూవీ గ్లింప్స్ విడుదలకు టైమ్ ఫిక్స్ (పోస్ట్)

by Hamsa |
RajaSaab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ‘రాజాసాబ్’ మూవీ గ్లింప్స్ విడుదలకు టైమ్ ఫిక్స్ (పోస్ట్)
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ ఏకంగా రూ. 1100 కోట్లు కొల్లగొట్టి బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే డార్లింగ్ ప్రజెంట్ మారుతీ డైరెక్షన్‌లో రాజాసాబ్ మూవీతో పాటు, హను రాఘవపూడితో ఓ సినిమా చేస్తున్నాడు. దీనిని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతుండగా.. సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు.

కానీ షూటింగ్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ క్రమంలో.. తాజాగా, రాజాసాబ్ నుంచి అప్డేట్ విడుదల చేస్తూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటనను రిలీజ్ చేసింది. ప్రభాస్ పోస్టర్ రిలీజ్ చేస్తూ రాజాసాబ్ గ్లింప్స్ రేపు జూలై 29న సాయంత్రం 5 గంటల 3 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఇందులో డార్లింగ్ లుక్ అదిరిపోయింది. చేతివేళ్లు కారు వైపు చూపిస్తూ షూట్ చేస్తున్నట్లుగా స్టిల్ పెట్టాడు. ఇక అది చూసిన ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed