Anasuya: వామ్మో మేకప్ లేకుండా దర్శనమిచ్చిన హాట్ బ్యూటీ.. షాక్‌లో ఫ్యాన్స్!

by Anjali |
Anasuya: వామ్మో మేకప్ లేకుండా దర్శనమిచ్చిన హాట్ బ్యూటీ.. షాక్‌లో ఫ్యాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై కెరీర్ ప్రారంభించిన హాట్ యాంకర్.. కుర్రాళ్ల ఫేవరెట్ నటి యాంకర్ అనసూయ ప్రస్తుతం వెండితెరను ఏలుతోంది. వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. బుల్లితెరపై యాంకర్‌గా సత్తా చాటి.. ఇప్పుడు అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ అదరహో అనిపిస్తుంది. అనసూయ నటనతో తెలుగు ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకుంటుంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ఫ’ సినిమాలో దాక్షాయణి పాత్రలో నటించి జనాల్ని మరింతగా ఆకట్టుకుంది.

రీసెంట్‌గా అనసూయ నటించిన సింబా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండలాంటి మొగుడొస్తాడనే డైలాగ్‌కు అనసూయ నవ్వడం మరింత హైలెట్ అయ్యింది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ మేకప్ వేసుకోకుండా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జీన్స్, క్రాప్ టాప్ ధరించి.. హెయిర్ లీవ్ చేసుకుని నేచురల్ లుక్‌లో ఓ పార్టీకి హాజరైనట్లు తెలుస్తోంది. తాజాగా వితౌట్ మేకప్ ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకోగా.. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Next Story

Most Viewed