ఆస్కార్ వేడుకల్లో సత్తా చాటిన హాలీవుడ్ ఫిల్మ్.. మొత్తం ఎన్ని అవార్డులు సాధించిందంటే?

by Hamsa |
ఆస్కార్ వేడుకల్లో సత్తా చాటిన హాలీవుడ్ ఫిల్మ్.. మొత్తం ఎన్ని అవార్డులు సాధించిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూసిన 95వ ఆస్కార్ వేడుకలు అమెరికాలో లాస్ ఎంజిల్స్‌లో ఈరోజు హట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హాలీవుడ్ ‘ఎవ్రీతింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమా ఏకంగా 7 ఆస్కార్ అవార్డులను అందుకుని సత్తా చాటింది. ఈ ఏడాది 11 విభాగాల్లో నామినేట్ అయి 7 అవార్డులను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఏ విభాగాల్లో వచ్చాయంటే ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్‌కు గాను అవార్డులు వచ్చాయి. అంతేకాకుండా ఉత్తమ నటిగా అవార్డ్ దక్కించుకున్న మిషెల్ యో ఆస్కార్ అందుకున్న తొలి ఆసియా మహిళగా నిలిచింది. దీంతో హాలీవుడ్ ఇండస్ట్రీ సినీ ప్రముఖలు ఈ సినిమాకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Advertisement

Next Story