ఆ ఒక్కటి అడగొద్దంటూ ఎస్కేప్ అయిన రాశీ ఖన్నా..!

by sudharani |   ( Updated:2024-04-03 06:35:14.0  )
ఆ ఒక్కటి అడగొద్దంటూ ఎస్కేప్ అయిన రాశీ ఖన్నా..!
X

దిశ, సినిమా: బ్యూటీఫుల్ హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఊహలు గుస గుసలాడే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా సినిమాలు చేస్తున్నప్పటికీ అనుకున్నంత స్టార్‌ఢమ్ మాత్రం దక్కడం లేదు. ముద్దుగా, బొద్దుగా, అందంగా ఉండే ఈ బ్యూటీ గ్లామరస్ పాత్రల్లో నటిస్తూ కుర్రాళ్లను మెప్పిస్తుంది అయినప్పటికీ.. కారణం ఏంటో తెలియదు కానీ సినిమా హిట్ అయిన రాశీకి మాత్రం కలిసి రావడం లేదు. ఇక తెలుగులో 2022 వ సంవత్సరంలో ‘థాంక్యూ, తిరు, సర్దార్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించిన రాశీ ఖన్నా.. మళ్లీ ఇప్పటి వరకు ఇంకో సినిమా ప్రకటించలేదు.

ఇక రెండేళ్ల గ్యాప్ తర్వాత ‘అరణ్మణై 4’ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. హారర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుందర్ దర్శకత్వం వహించాడు. ఇక ఇందులో సుందర్ హీరోగా నటించగా.. రాశీ ఖన్నాతో పాటు తమన్నా భాటియా, ఖుష్బు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 26 థియేటర్లో విడుదలకు సిద్ధంగా ఉండటంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ఈ క్రమంలో ఓ తన పెళ్లిపై ఎదురైన ప్రశ్నకు చాలా తెలివిగా ఎస్కేప్ అయింది రాశీ.

మొదట రాశీ ఖన్నా ‘అరణ్మణై 4’ గురించి మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో మంచి పాత్ర పోషించాను. ఈ సినిమా నాకు గుర్తింపు తెచ్చిపెడుతుందని నమ్మకంగా ఉంది’ అని చెప్పుకొస్తూనే.. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. బాహుబలి లాంటి చిత్రంలో నటించి తన సత్తా చాటుకోవాలనే కోరిక ఉందని తెలిపింది. ఇక అంతా బాగానే ఉంది కానీ, మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని ప్రశ్నించగా.. ఆ ఒక్కటి అడగొద్దంటూ తప్పించుకుంది రాశీ ఖన్నా.

Advertisement

Next Story