హీరో విశాల్ వివాదం..! స్పందించిన మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్‌కాస్టింగ్

by Nagaya |   ( Updated:2023-10-03 12:32:43.0  )
హీరో విశాల్ వివాదం..! స్పందించిన మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్‌కాస్టింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ హీరో విశాల్ నిన్న ఒక సంచలన కామెంట్స్ చేశారు. తన మూవీ మార్క్ ఆంటోనీ హిందీ వెర్షన్ రిలీజ్ కోసం లంచం తీసుకున్నారంటూ నిన్న ఒక వీడియో సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. ముంబాయిలోని సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫీస్‌లో తనకు ఈ అనుభవం ఎదురైందని తెలిపారు. మార్క్ ఆంటోని సినిమా హిందీ వెర్షన్ కోసం మొత్తం రూ.6.5 లక్షలు చెల్లించాల్సి వచ్చిందని, తన కెరీర్‌లోనే ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తానని తన సోషల్ మీడియా ఖాతాలో వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

ఈ నేపథ్యంలోనే ఇవాళ ట్విట్టర్ వేదికగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పందించింది. "నటుడు విశాల్ తెచ్చిన సీబీఎఫ్‌సీలో అవినీతి అంశం చాలా దురదృష్టకరమని విచారించింది. ఈ వ్యవహారంలోనే సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి ఒక సీనియర్ అధికారి ఇవాళే విచారణ కోసం ముంబైకి పంపిస్తున్నట్లు తెలిపింది. సీబీఎఫ్‌సీ ద్వారా ఎవరైన వేధింపులకు గురైతే మంత్రిత్వ శాఖకు తెలపాలని కోరింది. ఈ వ్యవహారంపై ఎవరైనా ప్రమేయం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Next Story