‘శుభాకాంక్షలు పిఠాపురం ఎమ్మెల్యే గారు’ : స్టార్ హీరో

by Anjali |
‘శుభాకాంక్షలు పిఠాపురం ఎమ్మెల్యే గారు’ : స్టార్ హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. గతంలో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కల్యాణ్.. ఈసారి 70 వేల పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. ‘చారిత్రాత్మక విజయం సాధించిన పవన్ కళ్యాణ్‌కు అభినందనలు!! నా మిత్రమా నీ కంటే దీనికి ఎవరూ అర్హులు కాదు. మీరు మరింత ఎత్తుకు ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. శుభాకాంక్షలు పిఠాపురం ఎమ్మెల్యే గారు’ అంటూ వెంకటేష్ ట్విట్టర్ వేదికన రాసుకొచ్చారు.

Advertisement

Next Story