అప్పుడు వేశ్యలు రాణులుగా ఆరాధించబడేవారు..

by sudharani |
అప్పుడు వేశ్యలు రాణులుగా ఆరాధించబడేవారు..
X

దిశ, సినిమా : ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డ్రీమ్ ప్రాజెక్ట్ 'హీరామండి' అప్‌డేట్ వచ్చేసింది. 'వేశ్యలు రాణులుగా పరిగణించబడే కాలం'గా స్నీక్ పీక్ అందించారు. మొత్తం ఆరు వేశ్య పాత్రల్లో.. మనీషా కోయిరాలా, అదితి రావు హైదరీ, సొనాక్షి సిన్హా, సంజీదా షేక్, రిచా చడ్డా, ప్రేరణ సింగ్ కనిపించనున్నారు. కలర్, కల్చర్, చార్మ్‌తో కూడిన సంజయ్ లీలా భన్సాలీ సరికొత్త ప్రపంచం.. నెట్‌ఫ్లిక్స్ వేదికగా త్వరలో విడుదల కానుంది. ఇక ఈ అప్‌డేట్‌పై స్పందిస్తున్న నెటిజన్స్.. కచ్చితంగా ప్రతీ ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా ఉంటుందంటున్నారు. ఇక రూ.160 కోట్లతో తెరకెక్కుతున్న సిరీస్ కచ్చితంగా స్పెషల్‌ అంటున్నారు అభిమానులు.

Advertisement

Next Story