చీరకట్టు అందాలతో హీటు పుట్టిస్తున్న హెబ్బా పటేల్.. లేటెస్ట్ పిక్స్ వైరల్

by Kavitha |
చీరకట్టు అందాలతో హీటు పుట్టిస్తున్న హెబ్బా పటేల్.. లేటెస్ట్ పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన మోస్ట్ గ్లామరస్ బ్యూటీ హెబ్బా పటేల్ అందరికీ సుపరిచితమే. ఈ మూవీలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఒక్క మూవీతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత కొన్ని మూవీల్లో నటించిన అనుకున్న రేంజ్‌లో హిట్ కాలేదు. అయినా గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా తన అందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. అదేవిధంగా సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలతో కుర్రకారుకి చెమటలు పట్టిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. చీర కట్టులో తన అందాలతో హీటు పుట్టిస్తూ ఫోటోలకి పోజులిచ్చింది. అంతే కాక ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ అంటూ క్యాప్షన్ జోడించింది. అది చూసిన నెటిజన్లు తన కొత్త సినిమాకు ఆల్ ది బెస్ట్ అని.. హాట్ బ్యూటీ ట్రెడిషనల్ బ్యూటీ అయ్యిందిగా అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పిక్స్ పై మీరు ఓ లుక్ వేసేయండి.

Advertisement

Next Story