- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతను అర్ధరాత్రి అలా చేసి వేధించేవాడు.. కాస్టింగ్ కౌచ్‌పై స్టార్ యాంకర్ ఎమోషనల్ కామెంట్స్!
దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె పలు సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత యాంకర్‌గా సూపర్ హిట్ షోలతో తన పాపులారిటీ పెంచుకుంది. నటనకు దూరమై యాంకర్‌గా ఎన్నో షోస్ చేసి బుల్లితెరపై రాణించింది. స్పెషల్ షోస్, ప్రీరిలీజ్ ఈవెంట్స్ అంటూ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. అప్పుడప్పుడు టీవీ షోలలో కనిపిస్తుంది. పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. గత ఏడాది సాయి ధరమ్ తేజ్ విరూపాక్షలో శ్యామల కీలక పాత్రలో నటించింది. ఇక ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ నటిగా దూసుకెళ్తుంది.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్యామల ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘‘సినిమాల్లో నటించాలన్న కోరకతో నేను మా అమ్మతో కలిసి హైదరాబాద్‌కు వచ్చాను. ముందుగా సీరియల్స్‌లో అవకాశాలు రావడంతో నటించాను. ఆ సమయంలో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురయ్యాయి. షూటింగ్‌లో కొందరు నన్ను విసిగించేవారు. లవ్ ప్రపోజల్స్ పెట్టి పదే పదే ఇబ్బంది పెట్టేవారు. అవన్నీ నేను తట్టుకోలేక సైన్ చేసి మూడు సీరియల్స్‌లో నటించి ఊరికి వెళ్లిపోదామని అనుకున్నాను. ఈ సమయంలోనే ఓ కెమెరామెన్ బాగా వేధించాడు. అర్ధరాత్రి ఫోన్లు చేసి దారుణంగా మాట్లాడి చిరాక్ తెప్పించేవాడు. ఈ క్రమంలోనే ఒకరోజు ఫోన్ మా అమ్మ లిఫ్ట్ చేసింది.
అప్పుడు అతను మీకు మగ దిక్కు లేదు కదా నేను మీ కోసం ఏమైనా చేస్తాను. మీ కూతురికి ఆ విషయం అర్థం కావడం లేదు. నేను ఎంత చెప్పినా వినడం లేదు. నేను చెప్పిన దానికి ఒప్పుకోకుంటే ఏదైనా చేయడానికి వెనుకాడను అని అన్నాడు. దీంతో మా అమ్మ అతను ఏదైనా హాని చేస్తాడని భయపడిపోయింది. ఇక్కడి నుంచి వెళ్లి పోదామని చెప్పింది. కానీ నేను అలాంటివి పట్టించుకోకు నాకేం కాదని ధైర్యంగా ఉండమని చెప్పాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్యామల కామెంట్స్ వైరల్ అవుతుండగా ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Read More..
12 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి..ఎంతో జీవితం చూశా.. స్టంట్స్ క్వీన్ సనోబర్