- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతడు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అది ప్రాబ్లెమ్ కాదా.. హాట్ టాపిక్‌గా హీరోయిన్ పోస్ట్
దిశ, సినిమా: టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండేది. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, మలయాళం సినిమాలు చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం మూవీస్‌కు దూరంగా ఉంటోంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూనమ్.. ఒక్కోసారి రాజకీయ నేతలపై, సినిమా హీరోలపై, డైరెక్టర్లపై చేసే కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారతాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. అసలు విషయంలోకి వెళితే..
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం టెస్లాను ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఇందుకు సంబంధించి ఏపీ అధికారులు ఆ కంపెనీకి మెయిల్ కూడా పంపారని ఓ ఇంగ్లీష్ పేపర్లో వార్త వచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలను వైసీపీ సపోటర్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రదీప్ రెడ్డి చింతా అనే వ్యక్తి ఆ పోస్ట్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘ప్రియమైన @elonmusk.. నేను భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాను. మాది భారతదేశంలోని అత్యుత్తమ రాష్ట్రాలలో ఒకటి. నేను యూకేలో టెస్లా కారు నడుపుతాను. టెస్లా అండ్ @X ఈ రెండూ నా రోజువారీ జీవితంలో భాగం. మేము, AP ప్రజలు, మీకు మరిన్ని కార్లను తయారు చేయడంలో సహాయం చేయడానికి ఇష్టపడతాము. మీకు అత్యంత స్వాగతం’ అంటూ పోస్ట్ పెట్టాడు.
అయితే.. ఈ పోస్ట్‌ను ట్యాగ్ చేస్తూ.. పూనమ్ కౌర్ ‘అతను మూడుసార్లు వివాహం చేసుకున్నాడు - అది సమస్య కాదా?’ అంటూ రిప్లై పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ నెట్టింట పెద్ద రచ్చగా మారింది. అయితే.. ఎలోన్ మస్క్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే ఏపీలో పవన్ కల్యాణ్ సైతం మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. దీంతో పూనమ్ కౌర్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ క్రమంలోనే.. కొంత మంది ఈ పోస్ట్‌తో వైసీపీకి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిందంటూ కామెంట్లు చేస్తుంటే.. మరికొందరూ మాత్రం పవన్ కల్యాణ్‌కు నెగిటివ్‌గా రిప్లైలు ఇస్తున్నారు. కాగా.. ఈ పోస్ట్ ఇంకెంత రచ్చ సృష్టిస్తుందో వేచి చూడాల్సి ఉంది.
He is married three times - will that not be a problem ? https://t.co/JokclEHSK3
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) April 12, 2024