- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అక్కినేని ఫ్యామిలీ కూరగాయలు కూడా కొనుక్కోరా?
దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు నుంచి నాగార్జున ఈయన కుమారులు ప్రతిరోజు క్రమం తప్పకుండా.. ఫిట్‌నెస్ మెయింటెన్ చేయడం కోసం వ్యాయామాలు చేస్తుంటారు. వ్యాయామాలు చేయడమే కాకుండా అతి తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. అంతేకాకుండా నాగేశ్వరరావు.. ‘తక్కువ తినండి ఎక్కువ కాలం జీవించండి’ అని ఇతరులకు సందేశాలు కూడా ఇచ్చేవారు. అయితే ఈ హీరో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వారు వారి ఇంట్లో పండించే కూరగాయలు మాత్రమే తింటారట. నాగేశ్వరరావు ఇంటి పక్కనే ఒక కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజు మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లొచ్చాక.. ఆ కిచెన్ గార్డెన్‌లో కాసేపు పనిచేస్తే కానీ ఆయనకు రోజు గడవదని చెప్పేవారు.
ఈయనకు గార్డెన్‌లో టైమ్ స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టమట. అందులో పండిన కూరగాయలు వంటింటికి పంపిన తర్వాత మళ్లీ గార్డెన్ అంతా శుభ్రంగా ఉందా లేదా అని చూసుకుంటూ ఉంటారట. అలా కిచెన్ గార్డెన్ అనే కాన్సెప్ట్ చాలా ఏళ్ల నుంచి అక్కినేని ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నారు. అలాగే కిచెన్ నుంచి వచ్చే ప్రతి వేస్ట్ పదార్థాన్ని కూడా కంపోస్ట్ చేస్తూ అక్కడే చెట్లకు ఎరువులుగా ఉపయోగిస్తారట.