- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
సాంప్రదాయిని.. సుప్పిని.. సుద్ధపూసని.. డిగ్రీలో జాయిన్ అయిన యంగ్ హీరో.. పారిపోయినా వదల్లేదు..
దిశ, సినిమా: సినిమాల మీద ఇంట్రెస్ట్‌తో 16ఏళ్లకే ఇంటి నుంచి పారిపోయి వచ్చాడు యంగ్ హీరో హర్షవర్ధన్ రాణే. ముందు స్మాల్ స్క్రీన్‌పై స్టార్‌గా మెరిసిన ఆయన.. తర్వాత బిగ్ స్క్రీన్‌పై కూడా క్లిక్ అయ్యాడు. ప్రజెంట్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. కానీ ఓ సినిమా షూటింగ్ టైమ్‌లో డైరెక్టర్ చెప్పిన మాటలు, సీన్స్ తనను ప్రభావితం చేశాయని..దీంతో మధ్యలోనే ఆపేసిన స్టడీస్ కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నట్లు తాజా ఇంటర్వ్యూలో తెలిపాడు. అందుకే లాస్ట్ ఇయర్ సైకాలజీ(హానర్స్) కోర్స్‌లో జాయిన్ అయినట్లు చెప్పాడు. ఇప్పటికే డిగ్రీలో చేరి ఏడు నెలలు పూర్తి కావస్తుండగా.. జూన్‌లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయని, షూటింగ్లో గ్యాప్ దొరికితే చాలు టైమ్ వేస్ట్ చేయకుండా చదువుకుంటున్నానని తెలిపాడు.
ఒకవేళ ప్రమోషన్స్‌కు వెళ్తే తనతోపాటు ట్యూటర్‌ను కూడా తీసుకువెళ్తున్నానన్న ఈ టాలెంటెడ్ హీరో.. వీలున్నప్పుడల్లా క్లాసెస్ వింటున్నానని, అందుకే హెడ్ సెట్ ఎప్పుడు వెంటే ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఒకవేళ చెవిలో హెడ్ సెట్‌తో కనిపిస్తే తాను చదువుతున్నానని అర్థం చేసుకుని వదిలేయాలని.. టైమ్ పాస్ చేస్తున్నాడని మాత్రం రాయొద్దని ఫన్నీ కామెంట్స్ చేశాడు. కాగా ‘తకిట తకిట’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన హర్షవర్ధన్ రాణే..‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘అనామిక’లాంటి చిత్రాల్లోనూ కనిపించాడు. ఆ తర్వాత ‘సనమ్ తేరీ కసమ్’ మూవీతో బాలీవుడ్ డెబ్యూగా పరిచయమై..‘తైష్’, ‘హసీన్ దిల్రుబా’తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.